నా గుండె చప్పుళ్ళ శబ్దాలు నీకు వినిపించలేని నిశ్శబ్దపు మౌనరాగాలు...

1) మౌనంగా ఉన్న నాకు ఏదో తెలియని శక్తి నన్ను బుజ్జగించి నీ జ్ఞాపకాల్లొకి నెట్టేస్తుంది

2) చిక్కులు చిక్కులుగా ఉన్న మనసు గాలానికి
మనిద్దరి జ్ఞాపకాలు చిక్కుకున్నాయి..విడదీయాలని చూస్తే..గాయాలే కనిపిస్తున్నాయి

3) మౌన భాషలో..మనసు ఒదిగిపోతుంది..కళ్ళుమూసుకున్న .. మనసు తడుముతోంది నీకోసం

4) గుండె అనే ముంతలో భావాలు దాచుకున్నాను అవసరం అయితే పగులగొట్టి వాడదామని

5) నాకెందుకో గమ్యమెప్పుడూ గతంలో ఇరుక్కపోయి
కంటికి కనిపించనంత దూరంగా కనిపిస్తుంది ఎందుకో....?

6) నీకోసం ఆలపించే ఆవేదన గీతాలకు మౌన రాగాలను కూర్చుతూ
అవేదనకు అనువయిన పదాలను వెతుకుతూ వేదనగా నా మనస్సును తడుముకొంటున్నా

7) చిన్న శబ్దానికి పెదవులు భయపడి మనసు మూగబోతే
నీజ్ఞాపకాలు చేస్తున్న అలజడులను అస్సలు తట్టుకోలేకపోతోంది నా హృదయం
 ఒకప్పుడు నీమాటలు మళ్ళేపూలు ఇప్పుడు ఎందుకో కత్తుల్లా నూరి
ఆ తియ్యటి మాటలకు పదునుపెట్టి గుండెళ్ళో గురి చూసి గుచ్చుతున్నావు

9) నీ మౌనాన్ని మంచు ముత్యాలు చేసి జ్ఞాపకాల మడతల్లో ఆర్తిగా మనస్పూర్తిగా దాచుకుంటున్నా

10) దగ్గరున్నప్పుడు నా మనస్సును పావురం అంత ప్రేమగా చూసుకొని
ఇప్పుడెందుకు దూరంవెళ్ళీ రాళ్ళేస్తున్నావు... గాయాలవ్వలనా తగిలిన గాయాలు సరిపోలేదనా

11) నా కలల్ని ముక్కలు చేసి కవితల్ని చెక్కుతున్నా గాని
ఎందుకో హృదయానికి తగిలిన గాయాలే కనిపిస్తున్నాయి అందులో

12) పగిలిన నా గుండె ముక్కలపై నడుస్తున్న
నీ పాదాలకు ఆ ముక్కలు గుచ్చుకుంటాయేమో అని భయంగా ఉంది

13) నా తలపులను తెలుసుకోలేనప్పుడు
నా భాష వెనకన భావం బరించరానిదిగా మారినప్పుడు
ఈ నిఘంటువులెందుకు ? గుండెకోతతో రాసే ఈ రాతలెందుకు..?

14) మదిలో నీతలపులు రాగానే మనసు కేరింతలు కొడుతుంది
జ్ఞాపకాల మడుగులో చిందులేస్తుంది మనస్సు లోకి కళ్ళల్లో కలల్ని ఒక్కసారిగా ఒలక బోస్తుంది

15) నిజం తెరలు తెరలు గా బానాలై గుండెల్లో గుచ్చుకొని కేకలై ప్రతిధ్వనిస్తున్నాయి గుండె గోడల్లో మన మదురమైన జ్ఞాపకాలు ఇరుక్కుపోయి గాయాన్ని పెద్దది చేస్తున్నాయి

16) గతాన్ని వదలి పెట్టి స్వగతం లో..ప్రస్తుతాన్ని ఇరికించి నా రేపు నేడవుతుందని

17) నా నీడవుతుందని ఆశపడ్డాను నా నీడను పట్టలేను
ఏ రేపునూ చూడలేను గతంలో స్వేచ్చగా ఎప్పటికీ బ్రతకలేను

18) రేపటి జ్ఞాపకాల కోసం నిన్నట్లానే నా ఎదురుచూపు మొదలవుతుంది ఎప్పటిలానే నీవు రావని తెలుస్తుంది వేదనగా మరో కవిత జన్మిస్తుంది

19) నిశ్శబ్దపు అంచులమీదకు జారిన జ్ఞాపకాల నిప్పు కణికలు మనసులో మటలు రేపుతున్నాయి

20 ) బరువెక్కిన రెప్పల మధ్య మన జ్ఞాపకాల తోటలో నిశ్శబ్దంగా బందీలయ్యాము..

21) ఈ కళ్ళలో దాచిన ముళ్ళ పూలనేరుకుంటూ..మనసు కొలనులో ఇమడని జ్ఞాపకాలను తలస్తూ

22) మనం అని చెప్పుకునేందుకు మనమద్యి మిగిలింది ఆ జ్ఞాపకాలే ...
మదిలోని భావాలు నిన్ను తడిమినప్పుడల్లా తడికళ్ళను తుడిచేందుకు నీ జ్ఞాపకాలే మిగిలాయి

23) చెప్పుకున్న మాటలకు అర్ధాలు చెరిగాయి..అపార్దాలు మన మద్యి మౌనంగా చేరాయి

24) మగతగా మదిని తొలుస్తున్న నీజ్ఞాపకాలు... నిద్రచాలనే తపనే తప్ప
కళ్ళు తెరిచినా మూసినా నీవే ఉంటే ఎలా నిద్రపోను నా భాదను ఎవరికి చెప్పుకోను

25) మౌనాన్ని బద్దలు కొట్టి ఊసులు ఊహల్లో తేలియాడుతున్నా ఏమౌతుందో ....?

26) చేరువవుతున్నాననే తొందరలో ఏకాంతపు చిరుగులను చూసుకోలేదు..అర్దం చేసుకుంటుందిలే అని

27) నీ వెన్నెల ఒడిలో సేద తీరాలని ఉంది..ఆ చల్లని వెలుగులో ప్రపంచాన్ని శోధించాలని ఉంది

28 ) మౌనమే నీ బాష అయినపుడు నీ ఉనికిలో ఒదిగిపోతా నీ ఊహల్లో కరిగిపోతా

29) కన్నీటి మేఘాలు ఎప్పుడు కరుగుతాయో..ఎప్పుడు కలవరపెడతాయో..ఎప్పుడు మురిపిస్తాయో

30) బీటలు వారి నెర్రెలిచ్చిన నా మనసు మీద నీ కన్నీళ్ళు ముత్యపు చినుకులై మెరుస్తున్నాయిలే

31) రెండు గుండెల మధ్య చెలరేగిన భావాల దొంతరల దూరం పెరిగితే దారి తప్పిన మనసుల గతి అంతే

32) నవ్వులు కరువైన చోట అనుభవం వెతుక్కోవటం అంటే గాలిలో దీపాన్ని వెలిగించటమే

33) ఒంటరితనం కమ్ముకున్నప్పుడు గుండె పచ్చి పుండుగా మారుతుంది
హృదయాన్ని నువ్వు తీరని గాయం చేసి వెళ్ళిపోయినప్పుడు ఎవరికి చెప్పుకోను

34) ఆ పెదవుల తోటల పూసే వరమే ఉంటే కథగానే మారిపోనా..కావ్యంగా కరిగిపోనా

35) ఏం జరిగిందో మరి ఆ కళ్ళు కరిగాయి..మనసులోకి చేరిన నీ జ్ఞాపకాల అలజడికి

36) టపా టపా కన్నీరు చెక్కిళ్ళపైనా గుండెలపైనా
జన జనా వాన టప టపా కన్నీటి వాన..అయినా నీ మనస్సు కరిగేనా

37) ఏకాంత వనంలో ఎదలో ఏదో రాగం వినిపిస్తూ ఉంటుంది..చుట్టూ చూస్తే నిశ్శబ్దం ఏంటో ఈ మాయ

38) నింగిలో దూరంగా అలుముకున్న చీకటిని తదేకంగా చూస్తూ ఉన్నాను
నీ మనసు పొరలు అడ్డున్నాయేమో.. కన్నీటి తెరలు అడ్డొస్తున్నాయేమో అందుకేనేమో ఈ చీకటి

39) గుండెను పెకిలించి పెల్లుబికే ప్రశ్నలు నీ సమాధానాల్లో జీవించమన్నాయి..

40) మౌనంగా ఉన్న నాకు ఏదో తెలియని శక్తి నన్ను బుజ్జగించి నీ జ్ఞాపకాల్లొకి నెట్టేస్తుంది

1 comment: