మనసు కొలనులో ఇమడని జ్ఞాపకాలను తలస్తూ

మనసు కొలనులో
ఇమడని జ్ఞాపకాలను తలస్తూ
అలజడి మొదలైంది 
మొదలు తీరని ఆవేదన
నిన్ను తలచుకున్న 
వెంటనే తన్నుకొస్తున్న కన్నీరు
ఇలా ఎన్నాళ్ళీ వెదుకులాట 
ఎన్నేళ్ళీ విరహ బాధ
ఆ మనిషిక మనసుకి దొరికేనా.. 
అదంటూ జరిగితే 
ఈ బ్రతుకిక పండేనా
మనిద్దరి మౌన వృక్షానికి పూసిన
భావ కుసుమ పరిమళాలు ఆక్రోశిస్తున్నాయి
జ్ఞాపకాల జడి వానలొ
కురుస్తున్న కన్నీటి వాన సాక్షిగా
కళ్ళ కిటికీ తుంపరలను ఆస్వాదిస్తూ.
నీ తలపులతో కరిగిన కాలం 
ఈ కళ్ళలో దాచిన ముళ్ళ పూలనేరుకుంటూ..
మనసు కొలనులో ఇమడని జ్ఞాపకాలను తలస్తూ

మనిద్దరి గుండె గోడల మధ్య

యదార్ధ అగాధాలను కొలుచుకుంటూ..
చేరిన ఆపార్దాల తొలగించాలని
చూసిన ప్రతిసారి జ్ఞాపకాల ముళ్ళు గుచ్చుకొని
నాహృదయం రక్తం ఓడేది అయినా
నీకోసం నీ చల్లని పిలుపుకోసం 
చేయని ప్రయత్నం లేదు..ఏ ప్రయత్నాన్ని ఆపనులే

No comments:

Post a Comment