మనసు గాలానికి జ్ఞాపకాలు చిక్కుకున్నాయి..

మనసు పగిలినప్పుడు ఆ నెర్రల్లో ..
భావాలు ఇరుక్కున్నాయి
కళ్ళనిండా కన్నీరున్నప్పుడు 
వెతికినా కనిపించని వెన్నెల్లాగా..
గుండె అనే ముంతలో ...
భావాలు దాచుకున్నాను
అవసరం అయితే పగులగొట్టి వాడదామని

మౌన భాషలో..
మనసు ఒదిగిపోతుంది..
కళ్ళుమూసుకున్న .. 
మనసు తడుముతోంది నీకోసం

చిక్కులు చిక్కులుగా 
ఉన్న మనసు గాలానికి
మనిద్దరి జ్ఞాపకాలు చిక్కుకున్నాయి..
విడదీయాలని చూస్తే..
గాయాలే కనిపిస్తున్నాయి

నాకెందుకో గమ్యమెప్పుడూ..
గతంలో ఇరుక్కపోయి
కంటికి కనిపించనంత దూరంగా కనిపిస్తుంది ఎందుకో

మనసు భాదకు 
బందీ అయిన కాలం
నిన్ను తలచుకున్నప్పుడలా గుండెను భారం చేస్తోంది

గుండె గాయాలకు కాగితాలద్ది.. 
ఆ రక్తపు మరకలని అందంగా.. 
కవితలగా మార్చాలని 
అనుకొంటున్నా ఎప్పటిలానే
రాత్రి తగిలిన గాయాలకు చెక్కిల్లమీద చారికలే
మన నికార్సైన ప్రేమకు సజీవ సాక్ష్యాలు మరి

No comments:

Post a Comment