రగులుతున్న అంతరంగ ఘోష నీకు చెప్పాలనే ప్రియా.......

అదృష్టమో దురదృష్టమో కానీ ఎందరో మనసులోతులూ, ఆ మనసుల్లో గూడుకట్టుకున్న అంతులేని వేదనా ఒక్కోసారి గుర్తుకొస్తున్న జ్జాపకాల నీడలు మనసులో చెరలరేపే అలజడులకు .. ప్రతిక్షనం ఆందోళన పడల్సి వస్తోంది

ఏ ఒక్కరి వ్యక్తిగత విషయాలూ వేరొకరితో పంచుకోలేం, భాదల్లో తచ్చాడి తానై వచ్చిన భాదపడకు నేనున్నా అంటూ తీయ్యని పలుకులతో పలుకరించిన అ చిలక పలుకులు ఎలా మరువను భాదల్లొ ఉన్న నాకు పలుకరించి మనసుపులకరింపజేసి .. అగ్గిరాజేసి అల వదిలేసి వెళ్ళావెందుకు ప్రియా.నన్నిలా ఒంటరిగా వదిలేసి తానే మరో భాదగా మిగిలి పోతే.... చెబితే ఇలా ఉంటే ఆభాద అనుబవించిన వాడికే తెలుస్తుంది
నాతో ఉన్న ప్రపంచం ప్రతీ క్షణం ఆనందంగా ఉండాలని కోరుకునే నేను నా చుట్టుపక్కల ఉండే అందరి మనస్సుల్లోని వేదనల్ని జీర్ణించుకోలేకపోతున్నాను.నిజమే జీవితం ఎన్నో సవాళ్లని ముందు పెడుతుంది!సమస్యలూ, భిన్న మనస్థత్వాల వ్యక్తులూ, వారు సృష్టించే నరకమూ, మన నియంత్రణలో లేని పరిస్థితులూ… అన్నీ కలగలిపి నిండు జీవితాల్ని మొండిబరుస్తూనే ఉంటాయి.కానీ జీవితం ఆ సమస్యలే కాదు, ఆ పాత జ్ఞాపకాలే కాదు, లేదా ఈ క్షణమూ మెలిపెడుతున్న బాధాకరమైన పరిస్థితులే కాదు.నమ్మకంగా ఈ మనిషిని నమ్మొచ్చు తానే నాజీవితం .. అనుకుంటాం .. ప్రపంచంలో తాను తోడుంటే చాలు అనుకొని సంతోషించే లోపే..కారనం ఏదైనా దూరం కావడం జీవితంలో తగులుతున్న దెబ్బలకు మరో భాదాకరమైన తీయ్యని భాదగా మిగిలి పోతుంది..ఆమనిషికి ముందే చెప్పా..నాకు దగ్గరైన వాళ్ళు దూరం అవుతాను అని నావిషయం లో అలా జరగదూ అంటూనే ..భాదాకరమైన పరిస్థ్తితుల్లో దూరం అయి గుండెళ్ళో భారంగా భాదగ మిగిలిపోతుంది 

ఎంత బాధలో ఉన్నా మనస్సులో ఆనందాన్ని నింపుకోగలిగే ప్రజ్ఞ ఎప్పటికి సాధించగలం? బాధల్ని మోయడం తప్ప ఇంకా జీవితంలో మిగిలిందేం లేదా?జీవితాంతం గడిచిపోయినవో, ఇప్పటివో బాధలే మోస్తూ ఉండాలంటే నా తోటి స్నేహితుల్లాగే నేనూ ఎంత బాధపడుతూ కూర్చోవాలో! అవును… నిజం చెప్తున్నాను… నేను బాధపడడానికి వంద కారణాలు ఇప్పటికీ నాకున్నాయి!! కానీ నేను భాదల్లో ఉన్నప్పుడు తానంతటా తానే ..పరిచయం చేసుకొని మనసుకు దగ్గరై..నేనున్నా అంటూ ఇచ్చిన ఓదార్పు మాటల్లో చెప్పలేనిది..ఎంత చెప్పుకున్నా తరగని తీయ్యని జ్ఞాపకం..అమె పరిచయమే . ఓ అద్బుతం.. మరి అకారణంగా దూరం అవ్వడం 
చిన్నదైనా, పెద్దదైనా ప్రతీ సమస్యనీ మనస్సులోకి లోతుగా తీసుకుంటూ మనల్ని మనం ఎంత వేదనలో కుంగదీసుకున్నామో ఆలోచించండి!నా దృష్టిలో ఆనందం అనేది.. స్విచ్ ఆన్, ఆఫ్ లాంటిది. ఇదే థీరీని నేను కొన్నేళ్లుగా నమ్ముతున్నాను. ఈ థీరీ కరెక్టే కాదో టెస్ట్ చేసుకుందామని చాలా బాధాకరమైన సందర్భాల్లోనూ మనస్సులో ఆనందాన్ని నింపుకుని నేను చేస్తున్న విఫల ప్రయత్నాలన్నీ నన్ను ప్రతిసారి వెక్కిరిస్తుంటాయి..పిచ్చోడా అని..నిజమేకదా..నన్ను కాదని వాళ్ళ సంతోషాన్ని వెతుక్కొని వెళ్ళిన వారికోసం నామనసు పడుతున్న వేదన ఎలా తెలపాలి అలా తెలుపలేని నేను నిజంగా పిచ్చోడీనే కదా .

ఈ క్షణం నా ఆలోచన ఇలా సాగుతోంది అనుకుందాం.. "ఎందుకు నీ లైఫ్ ఇలాగైపోయింది… ఎన్ని కష్టాలొచ్చాయి.. అస్సలు నీ లైఫే ఎందుకు ఇలాగుండాలి.." ఇలా రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. అవే అలోచనలు రిపీటెడ్‌గా మైండ్‌లో తిరుగుతున్నాయనుకుందాం. నా మానసిక స్థితి పుట్టెడు కష్టాల్లో కాక గంపెడు ఆనందంలో ఉంటుందా? ఒక్కోసారి హేపీగా ఉండే వాళ్ళను చూస్తే ... వింతగా అనిపిస్తుంది.. ఎలా ఉంటారు ఇలా .. ఎవరైనా ఇద్దరు ఆత్మీయంగా మాట్లాడుతుటే నాతో ఎందుకిలా ఉండరు అని నామీద నాకు చిరాకేస్తుంది.... నేనేం తప్పులు చేయలేదు. గుండెల నిండా ప్రేమ ..తానే లోకం అనుకున్ననే మరి ఇప్పుడేంది ఇలా..ఎక్కడ దూరం అవుతావో అన్న కంగారే గాని..తనను ఇబ్బంది పెట్టాలని కాదు.. అంతగా అర్దం చేసుకున్న అమె ఎందుకిలా ఆపార్దం చేసుకుంది.. నన్ను మర్చిపోయి తన స్నేహితులతో తానూ హేపీగానే ఉంది అస్సలు నాజ్ఞాపకాలు తనకు గుర్తే లేనట్టు.. తానెవరో తెలీనట్టు ...కాని నేనెందుకిలా ప్రతిక్షనం ప్రతినిమిషం తన కోసం తన తీయ్యని పిలుపుకోసం అల్లాడుతున్నా..ఇదేనా ప్రేమ అంటే.. తానే ప్రేమించాను అంది తరువాత .. అలా అన్నానా.. ..స్నేహాన్ని ప్రేమ పేరుతో అపహాస్యిం చేస్తున్నా అన్న క్షనాన భూమి బద్దలైనట్టు గుండెళ్ళో డైన మేట్లు పేలి హృదయం చింద్రమైనట్టె చెప్పలేని చెప్పుకోలేని భాద.. ఎవరికి ఎలా చెప్పుకోవాలి చెప్పుకుంటే ఎవరు బా భాదకు సొల్యూషన్ చూస్తారా అది వల్ల అవుతుందా ఏంటో నాది పిచ్చి ప్రేమ .. అబద్దాన్ని నిజం అనుకున్నానేమో తాను అన్నట్టు.. తానంతటా తానై వచ్చి . అలలాగా వచ్చి కలలాగా మిగిలి గుండెళ్ళో చెప్పుకోలేని భాదగా మిగిలి పోయావా ప్రియా

నాన్న

ఆలోచిస్తుంటే  కొత్తగా వుంది ?
కళ్ళ ముందు చూస్తున్న ఈ విచిత్ర లోకాన్ని
అమ్మ కడుపులో వున్నా మన రూపాన్ని తన ఊహల్లో
ఊహిస్తూ మన కోసం ఎదురుచూస్తున్న నాన్న
ఎంతమందికి గుర్తున్నారు ?
పలకటానికి  పేదవులు  కలవకపోయినా
నాన్న అన్న పిలుపుకోసం ఎదురుచూస్తున్న నాన్న
ఎంతమందికి గుర్తున్నారు ?
బుడి బుడి అడుగులతో నాన్న గుండే లపై నడచినా
ఆ చిన్న నాటి  జ్ఞ్యపాకాల స్మృతులు  
ఎంతమందికి గుర్తున్నాయి ?
తన కున్న సమస్యలన్నీ చేధించుకొనీ
కష్టల్లో...........!
నష్టల్లో ..............!
కన్నిలంటే తేలియకుండ పెంచిన నాన్న ఎంతమందికి గుర్తున్నారు ?
అడగ గానే అన్ని సమకురుస్తూ  ........
తన సమస్యలతో సతమతపడుతూ మన ముందు చిరు నవ్వు
నవ్వుతు మనల్ని నవ్విస్తున్న నాన్నఎంతమందికి
నాన్నలా గుర్తున్నారు ?
నేనున్న  అనే నమ్మకాన్నిచ్చే కేరప్ అడ్రస్ నాన్న?
నిన్ను గా నువ్వు మర్చిపోయి నేడు కొత్తగా ?
ప్రేమ ,ప్రియురాలు,విరహం,మనస్సు,కోరిక అంటు
నాన్న నే మరచిపోయావా ?
ఈ విచిత్ర లోకం లో పావులా మారిపోయావా?
మన కోసం తన జీవితం అంత కష్టపడి
మంచి బాట వేయాలను కున్న నాన్న నే మరచిపోయావా .......


తిరిగి
ఒక తీయ్యని  పలకరింపు
మధురమైన మాటలు
కమ్మనైన వెచ్చని  కౌగిలి
పెద్ద ఖర్చు కాదు..............
ఎం చేసిన ఇప్పుడే  .............?
నీ కోసం కరిగిపోయిన నాన్న కు
               ఆ జ్ఞ్యపాకాల స్మృతులను గుర్తుచేస్తూ .........
నాన్న జీవితపు పుస్తకం లో ప్రతి పేజి పై పూల వానా కురిపించాలి 

నా గుండె చప్పుళ్ళ శబ్దాలు నీకు వినిపించలేని నిశ్శబ్దపు మౌనరాగాలు...

1) మౌనంగా ఉన్న నాకు ఏదో తెలియని శక్తి నన్ను బుజ్జగించి నీ జ్ఞాపకాల్లొకి నెట్టేస్తుంది

2) చిక్కులు చిక్కులుగా ఉన్న మనసు గాలానికి
మనిద్దరి జ్ఞాపకాలు చిక్కుకున్నాయి..విడదీయాలని చూస్తే..గాయాలే కనిపిస్తున్నాయి

3) మౌన భాషలో..మనసు ఒదిగిపోతుంది..కళ్ళుమూసుకున్న .. మనసు తడుముతోంది నీకోసం

4) గుండె అనే ముంతలో భావాలు దాచుకున్నాను అవసరం అయితే పగులగొట్టి వాడదామని

5) నాకెందుకో గమ్యమెప్పుడూ గతంలో ఇరుక్కపోయి
కంటికి కనిపించనంత దూరంగా కనిపిస్తుంది ఎందుకో....?

6) నీకోసం ఆలపించే ఆవేదన గీతాలకు మౌన రాగాలను కూర్చుతూ
అవేదనకు అనువయిన పదాలను వెతుకుతూ వేదనగా నా మనస్సును తడుముకొంటున్నా

7) చిన్న శబ్దానికి పెదవులు భయపడి మనసు మూగబోతే
నీజ్ఞాపకాలు చేస్తున్న అలజడులను అస్సలు తట్టుకోలేకపోతోంది నా హృదయం
 ఒకప్పుడు నీమాటలు మళ్ళేపూలు ఇప్పుడు ఎందుకో కత్తుల్లా నూరి
ఆ తియ్యటి మాటలకు పదునుపెట్టి గుండెళ్ళో గురి చూసి గుచ్చుతున్నావు

9) నీ మౌనాన్ని మంచు ముత్యాలు చేసి జ్ఞాపకాల మడతల్లో ఆర్తిగా మనస్పూర్తిగా దాచుకుంటున్నా

10) దగ్గరున్నప్పుడు నా మనస్సును పావురం అంత ప్రేమగా చూసుకొని
ఇప్పుడెందుకు దూరంవెళ్ళీ రాళ్ళేస్తున్నావు... గాయాలవ్వలనా తగిలిన గాయాలు సరిపోలేదనా

11) నా కలల్ని ముక్కలు చేసి కవితల్ని చెక్కుతున్నా గాని
ఎందుకో హృదయానికి తగిలిన గాయాలే కనిపిస్తున్నాయి అందులో

12) పగిలిన నా గుండె ముక్కలపై నడుస్తున్న
నీ పాదాలకు ఆ ముక్కలు గుచ్చుకుంటాయేమో అని భయంగా ఉంది

13) నా తలపులను తెలుసుకోలేనప్పుడు
నా భాష వెనకన భావం బరించరానిదిగా మారినప్పుడు
ఈ నిఘంటువులెందుకు ? గుండెకోతతో రాసే ఈ రాతలెందుకు..?

14) మదిలో నీతలపులు రాగానే మనసు కేరింతలు కొడుతుంది
జ్ఞాపకాల మడుగులో చిందులేస్తుంది మనస్సు లోకి కళ్ళల్లో కలల్ని ఒక్కసారిగా ఒలక బోస్తుంది

15) నిజం తెరలు తెరలు గా బానాలై గుండెల్లో గుచ్చుకొని కేకలై ప్రతిధ్వనిస్తున్నాయి గుండె గోడల్లో మన మదురమైన జ్ఞాపకాలు ఇరుక్కుపోయి గాయాన్ని పెద్దది చేస్తున్నాయి

16) గతాన్ని వదలి పెట్టి స్వగతం లో..ప్రస్తుతాన్ని ఇరికించి నా రేపు నేడవుతుందని

17) నా నీడవుతుందని ఆశపడ్డాను నా నీడను పట్టలేను
ఏ రేపునూ చూడలేను గతంలో స్వేచ్చగా ఎప్పటికీ బ్రతకలేను

18) రేపటి జ్ఞాపకాల కోసం నిన్నట్లానే నా ఎదురుచూపు మొదలవుతుంది ఎప్పటిలానే నీవు రావని తెలుస్తుంది వేదనగా మరో కవిత జన్మిస్తుంది

19) నిశ్శబ్దపు అంచులమీదకు జారిన జ్ఞాపకాల నిప్పు కణికలు మనసులో మటలు రేపుతున్నాయి

20 ) బరువెక్కిన రెప్పల మధ్య మన జ్ఞాపకాల తోటలో నిశ్శబ్దంగా బందీలయ్యాము..

21) ఈ కళ్ళలో దాచిన ముళ్ళ పూలనేరుకుంటూ..మనసు కొలనులో ఇమడని జ్ఞాపకాలను తలస్తూ

22) మనం అని చెప్పుకునేందుకు మనమద్యి మిగిలింది ఆ జ్ఞాపకాలే ...
మదిలోని భావాలు నిన్ను తడిమినప్పుడల్లా తడికళ్ళను తుడిచేందుకు నీ జ్ఞాపకాలే మిగిలాయి

23) చెప్పుకున్న మాటలకు అర్ధాలు చెరిగాయి..అపార్దాలు మన మద్యి మౌనంగా చేరాయి

24) మగతగా మదిని తొలుస్తున్న నీజ్ఞాపకాలు... నిద్రచాలనే తపనే తప్ప
కళ్ళు తెరిచినా మూసినా నీవే ఉంటే ఎలా నిద్రపోను నా భాదను ఎవరికి చెప్పుకోను

25) మౌనాన్ని బద్దలు కొట్టి ఊసులు ఊహల్లో తేలియాడుతున్నా ఏమౌతుందో ....?

26) చేరువవుతున్నాననే తొందరలో ఏకాంతపు చిరుగులను చూసుకోలేదు..అర్దం చేసుకుంటుందిలే అని

27) నీ వెన్నెల ఒడిలో సేద తీరాలని ఉంది..ఆ చల్లని వెలుగులో ప్రపంచాన్ని శోధించాలని ఉంది

28 ) మౌనమే నీ బాష అయినపుడు నీ ఉనికిలో ఒదిగిపోతా నీ ఊహల్లో కరిగిపోతా

29) కన్నీటి మేఘాలు ఎప్పుడు కరుగుతాయో..ఎప్పుడు కలవరపెడతాయో..ఎప్పుడు మురిపిస్తాయో

30) బీటలు వారి నెర్రెలిచ్చిన నా మనసు మీద నీ కన్నీళ్ళు ముత్యపు చినుకులై మెరుస్తున్నాయిలే

31) రెండు గుండెల మధ్య చెలరేగిన భావాల దొంతరల దూరం పెరిగితే దారి తప్పిన మనసుల గతి అంతే

32) నవ్వులు కరువైన చోట అనుభవం వెతుక్కోవటం అంటే గాలిలో దీపాన్ని వెలిగించటమే

33) ఒంటరితనం కమ్ముకున్నప్పుడు గుండె పచ్చి పుండుగా మారుతుంది
హృదయాన్ని నువ్వు తీరని గాయం చేసి వెళ్ళిపోయినప్పుడు ఎవరికి చెప్పుకోను

34) ఆ పెదవుల తోటల పూసే వరమే ఉంటే కథగానే మారిపోనా..కావ్యంగా కరిగిపోనా

35) ఏం జరిగిందో మరి ఆ కళ్ళు కరిగాయి..మనసులోకి చేరిన నీ జ్ఞాపకాల అలజడికి

36) టపా టపా కన్నీరు చెక్కిళ్ళపైనా గుండెలపైనా
జన జనా వాన టప టపా కన్నీటి వాన..అయినా నీ మనస్సు కరిగేనా

37) ఏకాంత వనంలో ఎదలో ఏదో రాగం వినిపిస్తూ ఉంటుంది..చుట్టూ చూస్తే నిశ్శబ్దం ఏంటో ఈ మాయ

38) నింగిలో దూరంగా అలుముకున్న చీకటిని తదేకంగా చూస్తూ ఉన్నాను
నీ మనసు పొరలు అడ్డున్నాయేమో.. కన్నీటి తెరలు అడ్డొస్తున్నాయేమో అందుకేనేమో ఈ చీకటి

39) గుండెను పెకిలించి పెల్లుబికే ప్రశ్నలు నీ సమాధానాల్లో జీవించమన్నాయి..

40) మౌనంగా ఉన్న నాకు ఏదో తెలియని శక్తి నన్ను బుజ్జగించి నీ జ్ఞాపకాల్లొకి నెట్టేస్తుంది

మృత్యువుతో నేను.........

మృత్యువా నీకు దమ్ముందా...?( మృత్యువుతో నేను )
ఎందుకీ దోబూచి లాట.. 
ఎప్పటికైనా నీ దరి చేరాల్సినొన్నే కదా.. 
ఎందుకు నన్ను ప్రతిక్షనం ఇలా వేదిస్తావు ... 
ఇలా వేదించి ఏంసాదిస్తావు.. రమ్మనే చెబుతున్నా 
వచ్చి ఒక్కసారికి కౌగిలించుకో మనేగా నీకు ఎదురొస్తున్నా 
అయినా దొంగలా నన్ను వేదిస్తావు
నాకు నీవంటే(మృత్య్వువు)భయం లేదు..కావలంటే ఏక్షనమైనా కౌగిలించుకో 
నీ దగ్గరకు తీసుకపో ఎందుకు నాతొ దోంగ నాటాకాలాడవో తెలీయడంలేదు
ఎవరెవరిని దగ్గర చేస్తావు నా అనుకొని సంతోషించే ఘడియలు కూడా
లెక్కబెట్టుకోనీయవు ..నానుంచి దూరం చేసి మరొకరి వంచన చేరేలా చేసి
నన్ను తనతో దూషించేలా చేస్తున్నావు ఎందుకూ నాతో ఈ దోబూచాట
నాకు నేను ఆత్మహత్య చేసుకోవాలనే నీకోరికా 
మృత్యువా నేను నీకు భయపడితే కదా
నివిలా నా జీవితంతో డ్రామాలు ఆడాల్సింది
ఎప్పుడైనా నీవచ్చి నన్ను తీసుకెలతానంటే నేను రెడీ కదా
మనుషులు .. మానవత్వం.. మంచితనం ,, స్నేహం .. ప్రేమ
ఇలాంటి తుచ్చమైన పదాలు మనసులో చేర్చి నన్ను నన్ను లా 
ఉందనీయకుండా క్షనకాలం తట్టుకోలేని ఆనందాన్నిచ్చి
మరిక్షనంనుంచి నాకు ఆప్రేమే .. ఆస్నేహమే 
నరకం చూపించేలా చేస్తున్నావు..అవసరమా నీకు మృత్యువా
నాగుండె తట్టుకోలేదని తెల్సు .. అయినా నీవు ఇలాంటి 
పరిచయాలు చెసి నా అంతట నేను చచ్చేలా చేయ్యడమెందుకు 
నీవు కావాలంటే ఏక్షనమైనా నీ దరి చేరడనికి నేను రెడీ కాదా
మళ్ళీ ఈ పరిచయాలు .. ప్రేమలు .. ద్రోహాలు
నమ్మిన మనుషులతో అవమానాలు .. వాళ్ళూ మరొకరితో చేరి
నన్ను అవమానించిడం మరొకరికో అవమానించేలా చేయఢం 
నీకు అవసరమా మృతువా అందుకేగా నీకు ఎదురొస్తున్నా
అయినా నాదగ్గరికి రాకుండా ఏందుకిలా ప్రతిక్షనం చచ్చేలా చేస్తున్నావు
అందరూ బాగున్నారు ... అందరూ అనందంగా ఉన్నారు
నమ్మిమోసం చేసినవాళ్ళు . అవమానించినవాళ్ళూ 
ఏదో రూపంలో అవమానీంచేలా చేస్తున్నవాళ్ళూ 
ఎందుకు నాకీ శిక్ష.. నేను నిరీక్షించలేను
తట్టుకునే ఓపిక నాకికలేదు 
రా వచ్చి తీసుకపో ఏక్షనమైనా నేను రెడీ 
నీదరి చేరేందుకు మిత్రమా మృతువా ఇక నీడ్రామాలు ఆపు ప్లీజ్

Love Quotations in Telugu with images